బండి Vs ఈటెల: తెలంగాణ BJP రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పట్టు పోరు

0
201 Views

అనంతగిరి డెస్క్ :తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం కుర్చి పోరు కొనసాగుతోంది. ఒకవైపు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఈ పదవి కోసం కర్చీఫ్ వేస్తుండగా, మరోవైపు బండి సంజయ్ తన వ్యూహాలను అమలు చేస్తున్నాడు.

ఈటెల రాజేందర్ రాష్ట్ర అధ్యక్ష పదవి మీద తన ఆశలను సజీవంగా ఉంచుకుంటున్నాడు, కానీ బండి సంజయ్ ఈటెలకు ఈ పదవి రాకుండా అడ్డుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని అంటున్నారు. ఈ పదవి కోసం ఈటెలకు పోటీగా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు కూడా రంగంలోకి దిగారు.

బండి సంజయ్ తన వ్యూహాలను అమలు చేస్తూ, ఈటెలను నిలువరించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన అనుచరులు కుర్చీని అందుకుంటే సంతోషమే, కానీ ఈటెలకు దక్కకూడదని బండి శపథం చేసినట్టు సమాచారం.

పార్టీ లోపల ఇది పెద్దగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.