వలస కూలీల పిల్లలందరూ ప్రతిరోజు బడికి వచ్చి చదువుకోవాలి: అంకిత ఫౌండేషన్ వికారాబాద్ డివిజన్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాస్

0
106 Views

వికారాబాద్: వలస కూలీల పిల్లలందరూ ప్రతిరోజు బడికి వచ్చి చదువుకోవాలని అంకిత ఫౌండేషన్ వికారాబాద్ డివిజన్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు. మంగళ వారం వికారాబాద్ మండల పరిధిలోని చెంచు పల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అంకిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగులు, మాట్స్ , చెప్పులు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. పేద తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వలన వారు పిల్లల చదువులు ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే మానివేయడం జరుగుతుందని ,అలాంటి పిల్లలను గుర్తించి , మోటివేషన్ చేసి తిరిగి బడులకు ప్రతిరోజు వెళ్లే విధంగా సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక వలస కూలి , భవన నిర్మాణ కార్మికులు ఈ శ్రమ్ కార్డులు, లేబర్ కార్డు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని వాటిని లబ్ధి పొందాలి అంటే ఈ శ్రమ్ కార్డు ,లేబర్ కార్డు తప్పనిసరి అవసరమని తెలిపారు. పది సంవత్సరాల లోపు ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ సుకన్య సమృద్ధి యోజనలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భీమయ్య , అంకిత ఫౌండేషన్ వికారాబాద్ మండల కోఆర్డినేటర్ బి సంజీవరావు, ఎస్ఎంసి కమిటీ సభ్యులు, డ్వాక్రా మహిళలు , యువజన సంఘాల ప్రతినిధులు ,పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.