తాగిన బీర్ టిన్‌లో ఇరుకున్న పాము – వింత ఘటన

0
294 Views

అనంతగిరి డెస్క్: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో ఉన్న రైతు వేదిక వద్ద మందు బాబులు తమ సరదా కోసం తాగిన బీర్ టిన్‌లు అక్కడే పడేశారు. అయితే, వాటిలో ఒక పాము తల పెట్టి ఇరుక్కుంది. స్థానికులు ఆ పామును బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ, అది విఫలమైంది. పాము మూడు గంటల పాటు తీవ్ర ఇబ్బందులు పడింది. ఆ తర్వాత, పాము తన ప్రయాణంలో ముళ్ళకంప వద్దకు చేరుకోగానే, టిన్ ఊడిపోయింది. ఈ ఘటనతో పాము ప్రాణాపాయం నుంచి బయటపడింది.ఈ వింత సంఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది.