మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు చోరి

0
123 Views

వికారాబాద్: మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు లాక్కెళ్ళిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. వికారాబాద్ పట్టణం 31 వ వార్డు శివరాం నగర్ కాలనీకి చెందిన విద్యావతి ఉదయం 11 గంటల సమయంలో తన  కిరణా షాప్ లో ఉండగా సిగరెట్ కోసం వచ్చిన వ్యక్తి ఆమె మెడలో నుంచి బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లాడు. స్థానికులు గుర్తించేలోపే దుండగులు పారిపోగా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘన స్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టి సీసీ కెమెరాలు ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు బాతురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నాగరాజు తెలిపారు.