రెండు బైకులు ఢీకొని హాస్టల్ విధ్యార్థి,విధ్యార్ధి తండ్రికి గాయాలు

0
85 Views

తాండూరు: రెండు బైకులు ఢీకొని హాస్టల్ విద్యార్థి,విద్యార్థి తండ్రి కి తీవ్రగాలైన సంఘటన ఆదివారం తాండూర్ పట్టణం లో చోటుచేసుకుంది వివరాల్లోకెళ్తే తాండూర్ పట్టణంలోని ఫ్లవర్ బ్రిడ్జ్ పైన మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో రెండు బైకులు ఢీకొన్నాయి ఇందులో ఒ విద్యార్థి విద్యార్థి తండ్రి ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు.అయితే ప్రమాదానికి గురైన విద్యార్థి సాంఘిక గురుకుల పాఠశాలలో చదువుతున్న నరేందర్, తండ్రి తుల్జారాం గోనూరు గ్రామానికి చెందినవారు. ఆదివారం గురుకుల హాస్టల్ లో ఉండవలసిన విద్యార్థి బయటకి రావడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్లో ఉండాల్సిన విద్యార్థి ఎవరి పర్మిషన్ లేకుండా రావడం తండ్రితో వెళ్లిపోవడం తీవ్ర విమర్శలు వెళుతున్నాయి. ప్రమాదం జరిగిన కూడా హాస్టల్ నిర్వాహకులు ఎవరు కూడా స్పందించకపోవడం పై విమర్శలకు తావిస్తోంది. హాస్టల్ విద్యార్థి హాస్టల్లో ఉంటే ఈ ప్రమాదం చోటుచేసుకునేది లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.