మాజీ ఎమ్మెల్యే ఆనంద్ నిర్భందం అప్రజాస్వామ్యం:బీఆర్ ఎస్ నాయకులు

0
194 Views

వికారాబాద్: ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీలో భాగంగా వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హైదరాబాద్ ఆసుపత్రులను సందర్శంచాల్సి ఉండగా పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. సోమవారం తెల్లవారు జామునే పోలీసులు ఇంటికి చేరుకుని ఆనంద్ ను హౌస్ అరెస్ట్ చేయగా సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో ఆనంద్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. నిర్భందం అప్రజాస్వామ్యమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న ఈ కమిటీని అడ్డుకునే కుట్రలు రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని, ఈ కమిటీ ఆసుపత్రుల్లో తిరిగితే ప్రభుత్వ వైఫల్యం బయట పడుతుందని అరెస్ట్ లు చేస్తుందని మండి పడ్డారు. ఎమ్మెల్యే నివాసంకు చేరుకున్న వారిలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి , గోపాల్, నాయకులు మేక చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్, కొండల్ రెడ్డి, సత్యనారాయణ, షఫీ, అనిల్ తదితరులు ఉన్నారు.