నిర్బంధం అప్రజాస్వామ్యం : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

0
56 Views

వికారాబాద్: తెల్లవారుజామున నుండి ఇంటి చుట్టూ పదుల సంఖ్యలో పోలీసులు మొహరించి తమను హౌస్ అరెస్ట్ చెయ్యటాన్ని అప్రజాస్వామ్యం అని వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్  తీవ్రంగా ఖండిచారు.ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ BRS పార్టీ తరపున రాష్ట్ర శాఖ పేద ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం కోసం మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్య, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ లతో కలిపి ఏర్పాటు చేసిన త్రీ మెన్ కమిటీలో భాగంగా సోమవారం గాంధీ ఆసుపత్రిని సందర్శించవలసి ఉండగా తెల్లవారుజామున నుండి ఇంటి చుట్టూ పదుల సంఖ్యలో పోలీసులు మొహరించి తమను హౌస్ అరెస్ట్ చెయ్యటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.