ప్రతి కుటుంబానికి డిజిటల్ ఫ్యామిలీ కార్డు: సీఎం రేవంత్ రెడ్డి

0
99 Views

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలకు ఉపయోగపడేలా ఒకే కార్డు అందించాలన్నది ప్రభత్వ  ప్రధాన లక్ష్యం అని  ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో ప్రతి కుటుంబ సభ్యుడి హెల్త్ ప్రొఫైల్‌ను పొందుపరచాలని, దీర్ఘకాలంలో వైద్య సేవలకు కూడా ఇది ఉపకరించాలనే లక్ష్యాన్ని స్పష్టం చేశారు.

సమీక్షలో వైద్యారోగ్య, పౌర సరఫరాల శాఖ మంత్రులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కొత్తగా కుటుంబ సభ్యులు చేరినా, ఉన్న సభ్యులు తొలగించాల్సిన సందర్భంలో ఈ డిజిటల్ కార్డులను ఎప్పటికప్పుడు నవీకరించుకునే విధానాన్ని రూపొందించాలని సూచించారు.

ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ విధానం అమలులో ఉన్నందున వాటిపై అధ్యయనం చేయాలని, అధ్యయన నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక పట్టణం, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసి మొదటి దశలో ఈ కార్యాచరణను ప్రారంభించాలని నిర్ణయించారు.

ఈ డిజిటల్ కార్డులతో ప్రజలు ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా వ్యవస్థను రూపొందించాలని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరాలని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.