లోక్ అదాలత్ లో 2740 కేసులు రాజీ :జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి

0
81 Views

వికారాబాద్:లోక్ అదాలత్ కేసులు పరిష్కారంతో ఇరువర్గాలు విజయం సాధించినట్లేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ లో పలు కేసులను రాజీకుదిర్చారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 2740 కేసులు రాజీ అయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాజీమార్గంతో కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. రాజీ మార్గమే రాజమార్గమన్నారు. ఇరువర్గాలు విశాల దృక్షధంతో ఆలోచిస్తే లోక్ అదాలత్లతో కేసు నుంచి విముక్తి కలుగవచ్చన్నారు. ప్రతి వ్యక్తి చట్టాలపై తగిన అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కళాశాల, పాఠశాలల్లో, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిషోర్, సీనియర్ సివిల్ జడ్జి డీబీ శీతల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శృతిదూత, స్పెషల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అశోక్, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సయ్యద్ ఖయూమ్, పీపీలు, ఏపీపీలు, పలువురు సీనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.