మహాత్మా గాంధీ చూపిన శాంతి సామరస్యం ద్వారా ఏ సమస్య అయినా పరిష్కరించుకోవచ్చు:జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
71 Views

వికారాబాద్:భారత జాతిపిత మహాత్మా గాంధీ చూపిన శాంతి సామరస్యం ద్వారా ఏ సమస్య అయినా పరిష్కరించుకోవచ్చని, స్వచ్ఛత కు పేరుగాంచిన మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.
బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకుని మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ చెప్పిన విధంగా పట్టణంలో స్వచ్ఛత పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. పట్టణాలలో,గ్రామాలలో పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలని, మొక్కలు విరివిగా నాటి పర్యావరానాన్ని పరిరక్షించాలన్నారు .గాంధీజీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని వారి సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా జిల్లా ప్రజలకు మహాత్మాగాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుదీర్ , ఆర్ డి ఓ వాసు చంద్ర ,జిల్లా పౌర సంబంధాల అధికారి చెన్నమ్మ, శిశు సంక్షేమ అధికారి కృష్ణ వేణి, ఎస్సి కార్పోరేషన్ బాబు మోజేష్ , కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.