ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలి. క్రిస్టియన్ స్మశాన వాటిక నిర్ణయం వెనక్కి తీసుకోవాలి: హిందూ జనశక్తి రాష్ట్ర నాయకులు శ్రీనివాస్

0
72 Views

వికారాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని, వికారాబాద్ జిల్లా ఆధ్యాత్మీక ప్రాంతానికి నిలయమని ఇక్కడ స్మశాన వాటికల కోసం స్థలం ఎలా కేటాయిస్తారని హిందూ జన శక్తి రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం నవాబుపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. క్రిస్టియన్ ఆర్గజైషన్ కు, మిషనరీలకు ఎవరికి లేనంత భూములు ఉన్నాయని , వారికి ప్రభుత్వ భూములకు స్మశాన వాటిక కోసం ఎందుకు కేటాయించారన్నారు. గతంలో కూడా వికారాబాద్ అనంతగిరి ఆవరణలో 10 ఎకరాల భూమి ఇచ్చేందుకు చూస్తే అడ్డుకోవడం జరిగిందని, నవాబుపేట సమీపంలో కూడా గతంలో అడ్డుకున్నామన్నారు. ఇప్పుడు ఏకంగా అలాట్ మెంట్ కాపీలతో వారు భూమి పైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఇలాగే చేస్తే అడ్డుకుని ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెబుతున్నామని ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేక పోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.