రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి సీఎం కప్ : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
54 Views

వికారాబాద్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వారు రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి సీఎం కప్ 2024 నిర్వహించడమ జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారము క్రీడలను ప్రోత్సహించడానికి సీఎం కప్ 2024 నిర్వహించే సందర్బంగా జిల్లా లో .క్రీడాకారులకు మరియు యువతకు అవగాహన మరియు క్రీడల పట్ల ఆసక్తి ని పెంచుటకు కల్లెక్ట్రేట్ కార్యాలయం నుండి టార్చ్ రిలే ర్యాలి ప్రోగ్రాం ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి 3. 10 .2024 న ప్రారంభించారని , ఈ ర్యాలీ వికారాబాద్ జిల్లా కు చేరుకున్న్నందున టార్చ్ రిలే ర్యాలీ కలెక్టరేట్ కార్యాలయం నుండి ప్రారంచించడం జరిగిందని తెలిపారు. ఈ ర్యాలీ జిల్లా నుండి – ఎన్టీఆర్ ఎక్స్ రోడ్ -ఆలంపల్లి-కొత్తగాడి-గేట్ వనంపల్లి ఎక్స్ రోడ్-వెల్చాల్ –మోరంగ పల్లి-మోమిన్ పేట్-మేక వనం పల్లి , నుండి జిల్లలో విజయవంతంగా ర్యాలి ముగించుకొని. సంగారెడ్డి జిల్లాకు బయలు దేరుతుందని అయన తెలిపారు. ఈ కార్యక్రమమలో డి వై ఎస్ ఓ హనుమంతు రావు , స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుండి మధుసూదన్ ,వెంకటేశ్వర్ రావు,, పిడి లు, పీఈటీలు మరియు క్రీడాకారులు తదితరలు పాల్గొన్నారు.