స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ లు సత్తా చాటాలి : ముదిరాజ్ మహాసభ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్

0
126 Views

వికారాబాద్  : త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ముదిరాజ్ లు సత్తా చాటాలని,ముదిరాజ్ లు ఎవ్వరూ ఎన్నికలో పోటీలో నిలబడిన, పార్టీలకు అతీతంగా గెలిపించుకోవాలని ముదిరాజ్ మహాసభ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ అన్నారు.ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లిలోని చాయ్ ఇన్ బంకెట్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ వికారాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్.శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాసాని వీరేష్ ముదిరాజ్ హాజరయ్యారు.మొదటగా ముదిరాజ్ మహాసభ జెండా ఆవిష్కరణ చేశారు.అనంతరం సమావేశంలో ముదిరాజ్ మహాసభ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ మాట్లాడుతూ….ముదిరాజ్ లు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలని,ముదిరాజ్ లు బీసీ-డి నుంచి బీసీ-ఏ లోని మార్చే వరకు పోరాటం సాగించాలని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో బీసీ డిక్లరేషన్ లో ముదిరాజ్ లను బీసీ డి నుంచి బీసీ ఏ లోకి 100 రోజులో మారుస్తామని చెప్పి,నేటికీ దాని ఉసేత్తడం లేదని మండిపడ్డారు.బీసీ ఏ లోకి మార్చకపోతే ముదిరాజ్ లు గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు.బీసీ ఏ లోకి వస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని,ఉద్యోగులకు ప్రమోషన్ల వస్తాయన్నారు.5 శాతం లేని వారి కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకువచ్చి అధిక ఉద్యోగాలు కొల్లగొట్టుకుపోయారని,మనం తలుచుకుంటే బీసీ ఏ లోకి ఎందుకు ప్రభుత్వాలు మార్చవని ప్రశ్నించారు.మొదటగా ముదిరాజ్ నినాదంతో ముందుకు వెళ్లాలని దానితో పాటు బీసీ నినాదం ప్రజలలోకి తీసుకుపోదామన్నారు.ముదిరాజ్ ఓటర్లు అందరూ పేరు చివరన ముదిరాజ్ అని పెట్టుకుంటే ఎంత మంది ముదిరాజ్ లు ఉన్నారో తెలిసిపోతుందని,ఓటర్ లిస్ట్ లు చూస్తే పార్టీలు సైతం ఎన్నికలో ముదిరాజ్ లకు ప్రాధాన్యత ఇచ్చేలా ఉండాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లా పరిషత్ చైర్మన్ బరిలో ముదిరాజ్ నాయకులు ఉండాలని,అలాగే బీసీ ఎమ్మెల్యేలు,సర్పంచులు,ఎంపీటీసీ,జడ్పీటీసీలు ఉండాలన్నారు.అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ లకు నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు.ప్రతి గ్రామంలో 10 మంది ముదిరాజ్ కార్యకర్తలు బలంగా పని చేయాలని,బూత్ కమిటీ లు వేస్తామన్నారు.ముదిరాజ్ సంఘాలు ఎన్ని ఉన్న ముదిరాజ్ మహాసభ తో కలిసి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శాకం రాములు ముదిరాజ్, నాయకులు ముకుంద నాగేశ్వర్ ముదిరాజ్,రాములు ముదిరాజ్,గోపాల్ ముదిరాజ్,పాండు ముదిరాజ్,సత్యనారాయణ ముదిరాజ్ తదితరులు అన్నారు.