సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దన్యవాదాలు తెలిపిన జూనియర్ ఎన్టిఆర్,కళ్యాణ్ రామ్

0
89 Views

హైదరాబాద్: తెలుగు సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ మరియు కల్యాణ్ రామ్ “దేవర” చిత్రం విడుదలకు సంబంధించిన కొత్త జీవోను ఆమోదించినందుకు, మరియు తెలుగు చిత్ర పరిశ్రమకు నిరంతర మద్దతు అందిస్తున్నందుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వీరిద్దరూ ట్విట్టర్ ద్వారా తమ ధన్యవాదాలను వ్యక్తపరిచారు.

జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్‌లో, “సీఎం చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలుగు సినిమాకు ఇస్తున్న మద్దతుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు.” అంటూ పేర్కొన్నారు.

ఇటీవల విడుదలైన ఈ జీవో తెలుగు సినిమా పరిశ్రమకు మరింత ప్రోత్సాహం కలిగించనుందని భావిస్తున్నారు.