సీపీఎస్ ను రధ్దు చేసి ఓపీఎస్ ను పునరుద్దరించాలి:టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు శివకుమార్

0
156 Views

వికారాబాద్:: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్‌ స్కీం (ఓపీఎస్‌)ను పునరుద్ధరించాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శివకుమార్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. సీపీఎస్‌ విధానం వల్ల ఉద్యోగుల జీవితాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, 2004 నుండి అమలులోకి వచ్చిన ఈ విధానం ఉద్యోగులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. “సీపీఎస్‌ విధానం వల్ల లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పెన్షన్‌ విధానం ఉద్యోగుల భద్రతకు కీలకమైన అంశమని నాలుగు రాష్ట్రాల్లో పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించారని, ఇదే బాటలో తెలంగాణ ప్రభుత్వం కూడా పాత పెన్షన్‌ స్కీంను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.అలాగే, తెలంగాణలో అధికారంలోకి వస్తే పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని, ఆ హామీని గుర్తుచేస్తూ ప్రభుత్వం ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోవాలని శివకుమార్ డిమాండ్‌ చేశారు.