పదవ తరగతి పరీక్షల నిర్వహణ లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలి:జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి

0
16 Views

వికారాబాద్: పదవ తరగతి పరీక్షల నిర్వహణ లో గత అనుభవాలను దృష్టి లో ఉంచుకొని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఉదయం విద్యా శాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ నుండి ప్రశ్నా పత్రాల తరలింపు లో ఫోర్ విల్లర్ (కార్) వెహికల్ లోనే పూర్తి పోలీస్ బందోబస్తు ఏర్పాట్ల తో పరీక్ష కేంద్రాలకు తరలించాలని , పరీక్షలు పూర్తి అయిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసే వరకు పరీక్ష సెంటర్ విడిచి వెళ్లరాదని, చీఫ్ సుపరింటేన్దేంట్ లు తహసిల్దార్లు. పూర్తి బాద్యత వహించాలని ఆదేశించారు. ఎస్ ఎచ్ ఓ, సిట్టింగ్ స్వ్కాడ్, డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయం తో పరిక్షల నిర్వహణ జరగాలన్నారు. డ్యూటీ లో ఉండే ఎ ఎన్ ఏం లు , అంగన్వాడి సిబంది ఎవ్వరు కూడా మొబైల్ ఫోన్ లు వాడరాదని ఆదేశించారు. జిల్లా ఎస్ పి ఎన్. కోటి రెడ్డి మాట్లాడుతూ జిల్లా లో ఉండే 80 సెంటర్లలో చెక్ చేయడం జరుగుతుందని, పోలీస్ సిబ్బంది ని నియమించడం జరిగిందని. పూర్తి ఎస్కార్ట్ తో పోలీస్ స్టేషన్ నుండి ప్రశ్నా పత్రాల తరలింపు జరుగుతుందని తెలిపారు. జూమ్ మీటింగ్ లో జిల్లా విద్యా శాఖా అధికారి రేణుకాదేవి దేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.