సోమవారం పాఠశాలలకు సెలవు

0
618 Views

అనంతగిరిడెస్క్(వికారాబాద్): భారీ వర్షాల కారణంగా సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్ర సీఎస్ శాంతకుమారి ఈ విషయాన్ని తెలియజేశారు. శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో, జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ, ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించడం లేదా అనే విషయం స్థానిక కలెక్టర్ల నిర్ణయం ఆధారంగా ఉంటుందని చెప్పారు. వర్షాల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని, కలెక్టర్లు స్థానిక పరిస్థితులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు