ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

0
121 Views

వికారాబాద్:వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు వాటి దగ్గరికి వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు. చెరువులు నిండి అలుగులు పోస్తున్నందున చెరువుల దగ్గరికి వెళ్లకూడదని చెప్పారు.అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని, పాత ఇల్లలో నివసిస్తున్న వారు వెంటనే ఇంటిని విడిచి సమీపంలోని ప్రభుత్వ భవనాలు లేదా పాఠశాలలలో ఆశ్రయం పొందాలని సూచించారు. పాత గోడల దగ్గరకు వెళ్లవద్దని, కరంటు స్తంభాలు, వైర్లను ముట్టుకోవద్దని హెచ్చరిక జారీ చేశారు.రైతులు తమ పొలాల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని తొలగించుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని స్పీకర్ ఆదేశించారు.