ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ బిడ్డను సీబీఐ ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

0
21 Views

అనంతగిరి డెస్క్: కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ బిడ్డను సీబీఐ ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చనిి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ అన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. నిన్న కేసీఆర్ చూపించింది ‘ఫార్మ్ హౌజ్ ఫైల్స్’ కాదని ‘నేనింతే… నా బతుకింతే’ సినిమా అన్నారు. నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఫస్ట్ షో… సెకండ్ షో అన్నాడు.. చివరికి అది అట్టర్ ఫ్లాప్ షో అయిందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఏమీ లేదు. అది ఒక పెద్ద డ్రామా అని కవితను లిక్కర్ కేసు నుంచి కాపాడేందుకే…కేసీఆర్ ఢిల్లీకి పోయిండన్నారు. కేసీఆర్ ఫార్మ్ హౌజ్ డ్రామా స్క్రిప్ట్ అంతా ఢిల్లీలో కూర్చుని రాసిండన్నారు. నటీ నటులను కూడా ముందే ఎంపిక చేసి, వారికి ఎలా నటించాలో కేసీఆర్ చెప్పిండు అని ఫార్మ్ హౌజ్ డ్రామాలో ముగ్గురు నకిలీ ఆర్టిస్టులతో పాటు 4గురు ఆనిముత్యాల (ఎమ్మెల్యేల) స్టేట్మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేదు? అన్నారు. ఫార్మ్ హౌజ్ డ్రామా అంతా సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందని టెక్నాలజీ లేనప్పుడే దొంగ పాస్పోర్ట్ లను తయారు చేసినోడు కేసీఆర్. ఇక టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఏమైనా చేయగలడన్నారు. తుషార్ అనే వ్యక్తి బీజేపీ కి చెందినోడు కాదు. అతను బీడీజేఎస్ పార్టీకి చెందిన వ్యక్తి అని ఆ 4గురు ఎమ్మెల్యేలను ఫార్మ్ హౌజ్ నుంచి ఎందుకు బయటికి పంపడం లేదు? అన్నారు. కొడుకు, బిడ్డ కోసం కేసీఆర్ ఎంతకైనా తెగిస్తాడని ఫార్మ్ హౌజ్ లో ఉన్న ఆ 4గురు ఎమ్మెల్యేలకు కోర్టు రక్షణ కల్పించాలని కోరుతున్నామన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినోడే కేసీఆర్… సంతలో పశువుల్లా 37 మంది ఎమ్మెల్యేలను కొన్నడన్నారు. టీడీపీ కి సంబంధించిన ఒక ఎమ్మెల్యేను కొని, అతనికి మంత్రి పదవి ఇచ్చాడన్నారని తెలిపారు. ఇన్ని ఆధారాలు ఉంటే… కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయలేదని కొడుకేమో ఎవరినీ మాట్లాడొద్దు అంటే… అయ్య ఏమో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. కేసీఆర్ సర్కార్ జారీ చేసి జీవో లను ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదు? అన్నారు. తెలంగాణలో మానవ హక్కులను కాలరాస్తూ… ప్రజల ఉసురు పోసుకుంటున్నడన్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ ఒక కామెడీ షో అయిందని నిన్న కేసీఆర్ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేనప్పుడు, అది ప్రెస్ మీటే కాదన్నారు. ఇజ్రాయెల్ టెక్నాలజీ తెచ్చి, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్నారు. కేసీఆర్ OLX పీసులను(ఆ 4గురు ఎమ్మెల్యేలను) పక్కన కూర్చోబెట్టుకుని, ఉద్యమకారులను విస్మరిస్తున్నాడన్నారు. కొప్పుల ఈశ్వర్ ఉద్యమకారుడు.. మంచి వ్యక్తి, అతనిని కేసీఆర్ ఎందుకు పక్కన కూర్చోబెట్టుకోలేదు? అని ప్రశ్నించారు. మంత్రివర్గంలో ఏకైక దళితుడు కొప్పుల ఈశ్వర్.. అలాంటి వ్యక్తి ని కావాలనే అవమానించారన్నారు. కొప్పుల ఈశ్వర్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తా అని హామీ ఇచ్చిన కేసీఆర్… కేటీఆర్ వల్లనే.. డెప్యూటీ సీఎం గా కొప్పులకు అవకాశం ఇవ్వలేదన్నారు. మా నాయకుల పై మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పై ఆరోపణలు వస్తే… ఇంకా కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? అన్నారు. మేము తప్పు చేయలేదు కాబట్టే… తడిబట్టలతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రమాణం చేసినమని కేసీఆర్ ఫార్మ్ హౌజ్ డ్రామాలో నిజానిజాలు తేల్చేందుకు సీబీఐ, సిట్టింగ్ జడ్జ్ లేదా సిట్ తో దర్యాప్తు జరపాలని మేము కోరుతుంటే… ఎందుకు విచారణ జరపడం లేదన్నారు.సీబీఐ ని ఎందుకు రాష్ట్రంలోకి* *అనుమతించడం లేదని ప్రశ్నించారు.