దొంగ పట్టా చేసి 32ఎకరాలు బదిలి … తహసిల్దార్ పై దాడి

0
16 Views

మర్పల్లి : వంశపారంపర్యంగా వచ్చిన భూమిని అసలు పట్టా దారులకు తెలియకుండా 32ఎకరాల భూమిని తహసిల్దార్ పట్టా మార్పిడి చేయడంతో అన్యాయాన్ని ప్రశ్నించిన రైతులపై దురుసుగా ప్రవర్తించడంతో తహసిల్దార్ పై రైతు దాడి చేశాడు . ఈ సంఘటన శుక్రవారం మర్పల్లి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం, అమ్రాది ఖుర్దు గ్రామానికి చెందిన ఆరుగురు రైతులకు మర్పల్లి మండల పరిధిలోని గుండ్ల మర్పల్లి గ్రామంలో సర్వే నెంబర్లు 54, 60 లలో 32ఎకరాల భూమి ఉంది . ఈ భూమిని తాతల కాలం నుండి సాగు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. కాగా రైతులకు తెలియకుండా స్థానిక తహసిల్దార్ పట్టా మార్పిడి చేయడంతో మా భూమిని మాకు తెలియకుండ ఎందుకు ఇతర వ్యక్తులపై కి పట్టా మార్చావని తహసిల్దార్ ను రైతు లక్ష్మణ్ అడుగగా తహసిల్దార్ దురుసుగా మాట్లాడటంతో ఆగ్రహించిన రైతు ఎమ్మార్వో పై దాడి చేశాడు. తహసీల్దార్ శ్రీధర్ పిర్యాదు తో రంగులోకి దిగిన పోలీసులు రైతును అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.