మెథడిస్ట్ జాతరలో అన్నదానం నిర్వహించినందుకు ఫౌండేషన్ సభ్యులు

0
16 Views

వికారాబాద్ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెథడిస్ట్ 100వ జాతర సందర్భంగా దారుర్ సమీపంలో జరుగుతున్న మెథడిస్ట్ జాతరలో వడ్ల నందు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ జాతరకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర కర్ణాటక తదితర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు ఇక్కడ వచ్చిన వారికి అన్నదానం నిర్వహించడం ద్వారా ఎంతో తృప్తి కలుగుతుందని ఫౌండేషన్ చైర్మన్ వడ్ల నందు తెలిపారు. భక్తులకు కనీస సౌకర్యంతో పాటు అన్నదానం ఎంతో ముఖ్యమైనదని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో కొండాపూర్ కలాం సర్పంచ్ పరమేష్ సభ్యులు విజయ్ తదితరులు పాల్గొన్నారు.