21 నుండి వికారాబాద్ లో అతి రుద్ర మహయజ్ఞం

0
31 Views

వికారాబాద్: వికారాబాద్ పట్టణంలో ఈ నెల 21 నుండి 27 వరకు అతి రుద్ర మహయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆధ్యాత్మీక సేవా మండలి సభ్యులు సుబాష్ పంతులు పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని చిగుళ్లపల్లి మైదానంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వికారాబాద్ పట్టణంలో గత 11 సంవత్సరాలుగా రుద్రాభిషేక కార్యక్రమాలను దేవాలయాల్లో ఇండ్లలో నిర్వహించడం జరిగిందని 12వ సంవత్సరం ఈ సారి అతిరుద్ర మహాయజ్ఞం నిర్వహించడం జరుగుతుందన్నారు. 14651 రుద్రాలలోని సహకారం ఈ అతిరుద్ర మహాయజ్ఞం
ద్వారా లభిస్తుందన్నారు. ఈ యజ్ఞం ద్వారా మనిషి ఆయుష్షు పెరుగుతుందని, మనస్సు చెంచాలం వీడుతుందన్నారు. శరీరంలోని అవయవాలు అన్నీ బాగా పనిచేస్తాయన్నారు. ఈ యజ్ఞం ద్వారా దేశం సుబిక్షంగా ఉంటుందని, వర్షాలు కురిసి పాడిపంటలు సస్యశ్యామలంగా ఉంటాయన్నారు. పూర్వకాలంలో స్వర్గ ప్రాప్తి కోసం ఈ యజ్ఞం చేసేవారని ప్రస్తుత కలియుగంలో విశ్వ కళ్యాణం కోసం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అతి రుద్ర మహాయజ్ఞులో శ్రీ మహగణపతి, శతచండి, రాజ శ్యామల, మహా సుదర్శన, సంతతధారాభిషేక యుక్త శాంతి కల్యాణసప్తాహ మహోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ యజ్ఞ కార్యక్రమంలో 150 మంది వేద పండితులు పాల్గొంటారని భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించడతో పాటు భోజనం సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి స్వామి వారిని దర్శించు
కోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక మండలి సభ్యులు రాజు, చిగుళ్లపల్లి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.