వికారాబాద్ లో పంటితో డీసీఎం లాగిన హరీష్ అన్నయ్య

0
22 Views

వికారాబాద్ : వికారాబాద్ లో నిర్వహిస్తున్న ఆధ్యాత్మీక కార్యక్రమంలో భాగంగా శనివారం బ్రహ్మకుమారి ఈశ్వరీయ ఆధ్వర్యంలో రాజస్థాన్ కు చెందిన హరీష్ అన్నయ్య వికారాబాద్ పట్టణంలోని ఎంఆర్ పీ చౌరస్తాలో డీసీఎం ను పంటితో ముందుకు లాగారు . గత రెండు రోజులుగా మూడు గంటల పాటు మంచుపై నిలబడి ప్రదర్శన ఇచ్చిన హరీష్ అన్నయ్య ముందుగానే శనివారం పంటితో లారీని లాగుతానని చెప్పడంతో ఈ ప్రదర్శన చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. హరీష్ అన్నయ్య ఇప్పటి వరకు 4 వేలకు పైగా ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందని ఆయనకు ఐరన్ మ్యాన్ అనే బిరుదు ఉందని బ్రహ్మకుమారి ఈశ్వరియ మధు అక్కయ్య తెలిపారు.