వికారాబాద్ పేరు మార్చండి గంగవరంగా పెట్టండి అప్పుడే అభివృద్ది జరుగుతుంది: కాకినాడ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి

0
35 Views

వికారాబాద్: హిందూ సాంస్కృతి చాలా గొప్పదని కాకినాడ పీఠాధిపతులు పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని ఐదవ రోజు కొనసాగుతున్న అతిరుద్రమహాగం
కార్యక్రమంలో భాగంగా సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంతకు ముందు ఉదయం నుంచి నిత్య జరిగిన హోమ కార్యక్రమాలను నిర్వహించారు. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భ
స్తులు తరలి వచ్చారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పరిపూర్ణ నంద స్వామి సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో అక్కడి చేరుకోవడంతో ఆయనకు హరతి ఇచ్చి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, హిందూ ధర్మం విశిష్టతను వివరింవారు. కానీ ప్రస్తుత మానవ జీవితం రూపం, రూపాయి మీద నడుస్తుందని తెలిపారు. వికారాబాద్ పేరు వికారంగా ఉందని ఈ బాద్ లు వద్దని గంగవరం అని మారుస్తే గంగలా స్వచ్చగా మారుతుందన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్దామన్నారు. పేర్లతో కూడా అభివృద్ధి జరుగదని , పేరును బట్టి అభివృద్ధి ఉంటుందని తెలిపారు. వికారాబాద్ వద్దుఅని అందరూ ఆర్జీలు పెట్టిందని సూచించారు. ఉదయంం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హ స్వామి వారిని దర్శించుకుని రుద్రాభిషేకం నిర్వహించారు.