ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేలకు ముక్కు రాసి రాజీనామా చేయాలి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

0
40 Views

వికారాబాద్: వికారాబాద్, ఫిబ్రవరి 2: ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే నెలరోజుల్లో సంక్షేమ పథకాలు అందించడంతో పాటు రుణమాఫీ చేస్తానని ఫించన్ రూ.4 వేలు చేస్తానని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే చేస్తానని చెబుతున్నాడని, కేంద్రంలో కాంగ్రెస్అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదని సంక్షేమ పథకాలు అమలు చేయక పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి పోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని నర్సింగ్ గౌలికార్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ వికారాబాద్ నియోజకవర్గ జార్యకర్తల సమీక్ష సమావేశం జిల్లా అద్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నసమయంలో నేను దగ్గరుండి ప్రగతి భవన్ కట్టించడం జరిగిందని అప్పుడు కాంగ్రెస్ నాయకులు అందులో 150 బెడ్ రూమ్లు ఉన్నాయని, బంగారు నిధులు ఉన్నాయనిబులెట్ ప్రూప్ వాత్ రూమ్లు ఉన్నాయని చెప్పడం జరిగిందని. ఇప్పుడు అదే భవనంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉంటున్నారని ఆయన అవి అన్ని ఉన్నాయా అని సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాద
ర్బార్ ఏర్పాటు చేసి ఒక్క రోజు నిర్వహించారన్నారు. ఉప ముఖ్యమంత్రి ఒక రోజు మిగితా మంత్రులు మూడు నాలుగు రోజులు నిర్వహించి ఇప్పుడు అధికారులకు ఆ బాధ్యతలు అప్పగించారన్నారు. అప్పటి ముఖ్య మంత్రి కేసీఆర్ అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కేవలం 50 రోజుల్లోనే 14 వేల కోట్ల అప్పులు చేసిందన్నారు. 5 ఏళ్లలో ఇంకా ఎన్ని అప్పులు చేస్తుందో .చూడాలన్నారు. పార్లమెంట్లో రాష్ట్ర నీటి ప్రాజెక్టుల కోసం మాట్లాడాలంటే బీఆర్ఎస్ పార్లమెంట్ లో ఉండాలని మిగితా పార్టీలు మన ప్రాంతం కోసం మాట్లాడే అవకాశం ఉండదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీని బొంద పెడితే వారికి భయం పట్టుకుంటుందన్నారు. మన ఎంపీ ఉంటే మనకు గౌరవంతో పాటు మన పనులు అవుతాయని ఫోటోకాల్ ఉంటుందన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కేవలం 18 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయని, రాష్ట్రంలో 39 స్థానాలు గెలిచామన్నారు. అప్పుడు గబర పడాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ ధర్మయుద్ధం చేసి ఏమి గెలువలేదన్నారు. ప్రజలకు అబద్దాలు చెప్పి 740 చిందన్నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్సీటీ సీలు, మండలాల అధ్యక్షులు, పీఏసీఎస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు…