ఫిబ్రవరి మాసం వరకు వంద శాంతం E-kyc చేయాలి:జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్

0
22 Views

వికారాబాద్:తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులందరినీ E-kyc చేయించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు.శనివారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్ లో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ కొండల్ రావు, రేషన్ దుకాణాల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి మాసం వరకు జిల్లాలో వంద శాంతం E-kyc పూర్తిచేయాలని ఆదేశించారు. ఎవరైనా డీలర్లు రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లయితే వారి డీలర్ షిప్ ను రద్దు చేయడంతో పాటు, క్రిమినల్ కేసులో నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో బినామీ డీలర్లు ఉన్నట్లయితే పౌర వారిని గుర్తించి పౌరసరఫరాల అధికారులు, తాసిల్దారులు, డిప్యూటీ తహసీల్దారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు రేషన్ దుకాణాల నుండి బియ్యం తీసుకుని ఇతరులకు అమ్మితే వారిపై కూడా చర్య చేపట్టాలని, ప్రతి లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని సొంతంగా వాడుకోవాలని తెలిపారు. గ్రామాలలో తిరిగి రేషన్ బియ్యం కొనందుకు వచ్చేవారి సమాచారాన్ని సంబంధిత అధికారులకు వెంటనే తెలియపరచాలన్నారు. డీలర్లు సకాలంలో దుకాణాలను తెరిచి లబ్ధిదారులకు మంచి రేషన్ బియ్యం అందించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.ఈ సమావేశంలో రేషన్ దుకాణాల అధ్యక్షుడు జూకా రెడ్డి, పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు.