పార్లమెంట్ ఎన్నికలను ఈవీఎం లను సిద్ధం చేయాలి:జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి

0
28 Views

వికారాబాద్:రాబోవు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈవీఎం లను సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు.గురువారం వికారాబాద్ మండల తహసిల్దార్ కార్యాలయంలో ఓటరు ముసాయిదా తుది జాబితా పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. నేడు జిల్లా కలెక్టర్ ఓటర్ ముసాయిదా తుది జాబితాను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంటు ఎన్నికలకు ఈవీఎంల మొదటి స్థాయి పరిశీలన చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 9,84,068 మంది ఓటర్లు ఉన్నారని ఇందులో 4,86, 109 మంది పురుషులు, 4,97,920 మంది స్త్రీల ఓటర్లతో పాటు 39 మంది ట్రాన్స్ జెండర్లు ఓటర్లుగా నమోదయ్యారని ఆయన తెలిపారు. పరిగి నియోజకవర్గంలో 2,66, 273 మంది ఓటర్లకు గాను 1,33,625 మంది పురుషులు, 1,32,639 మంది స్త్రీలు, 9 మంది ట్రాన్స్ జెండర్లు ఓటర్లు ఉన్నారన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో 2,31,679 మంది ఓటర్లు నమోదు కాగా 1,15,019 మంది పురుషులు, 1,16,647 మంది స్త్రీలు, 11 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. తాండూర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,43,849 ఉండగా 1,18,228 మంది పురుషులు 1,25,614 మంది స్త్రీలు 7 గురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారని తెలిపారు. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గం లో 2,42,267 మంది ఓటర్లలో 1,19,237 పురుష ఓటర్లు ఓటర్లు కాగా 1,23,020 మంది స్త్రీల ఓటర్లతో పాటుగా 10 మంది ట్రాన్స్ జెండర్ ల ఓట్లు కలిగి ఉన్నట్లు ఆయన తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించిన విధంగానే పార్లమెంటు ఎన్నికల్లో కూడా తమ తోడ్పాటును అందించాలని కలెక్టర్ కోరారు.