తెలంగాణ రాష్ట్ర ఉపాధి మరియు శిక్షణ డైరెక్టరెట్ అధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం ఒక్కరోజు వర్క్ షాప్

0
14 Views

వికారాబాద్:తెలంగాణ రాష్ట్ర ఉపాధి మరియు శిక్షణ డైరెక్టరెట్ (DET ), సంకల్ప్ స్కిల్ డెవలప్మెంట్ , AP ప్రొడక్టివిటీ కౌన్సిల్ వారి అధ్వర్యంలో వికారాబాద్ లోని స్వాగత్ హోటల్ లో నిరుద్యోగ యువత కోసం ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించడం జరిగిందని జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ ఒక ప్రకటనలో తెలిపారు. స్వయం ఉపాధి, వేతన ఉపాధి, మరియు మహిళలు, యువతకు గల అవకాశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమములో ఐటిఐ ప్రిన్సిపాల్ నరేంద్ర బాబు, ట్రైనర్లు వెంకటేష్, శ్రీధర్, ఏపీసీసీ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ దుర్గా రెడ్డి, కన్సల్టెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో 89 యువతి, యువకులు పాల్గొన్నారు వారికి ఈ సందర్భంగా సర్టిఫికేట్లు మరియు కిట్లు అందజేయడం జరిగిందన్నారు.