వాస్తవానికి దూరంగా తెలంగాణ 2024-25 బడ్జెట్:వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

0
34 Views

వికారాబాద్:తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ 2024-25ను కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో (రూ.2,75,891కోట్లు) ప్రవేశపెట్టారు అయితే ఇది వాస్తవానికి దూరంగా ఉందని, ఎన్నికల ముందు ప్రజలను ఆకర్షించడానికి ప్రకటించిన 6 గ్యారటీల అమలు ప్రశ్న్యర్థకంగా మారిందని వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ విమర్శించారు.బడ్జెట్ లో ఎక్కడ కూడా నిరుద్యోగ భృతిని ప్రస్తావించకుండా నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు.రైతులకు రుణమాఫీ గురించి దాదాపుగా 40 వేల కోట్లు అంచనా అవుతుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఏ మాత్రం సరిపోయేదిగా లేదన్నారు.మహిళలకు గృహలక్ష్మి పథకంలో భాగంగా అందిస్తామని హామీ ఇచ్చిన రూపాయలు 2500/- లకు సంభందించి బడ్జెట్ లో ఎక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించబడలేదు అయితే 6 గ్యారంటీ లకు కేటాయించిన బడ్జెట్ లో నుండి మాత్రమే ఇవన్నీ సాధ్యపడవు అని పేర్కొన్నారు.