టీ ఎస్ పీ ఎస్ సీ గ్రూప్-1 ఉచిత కోచింగ్:టీఎస్ బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి

0
16 Views

వికారాబాద్: మార్చ్ 8 నుండి టీఎస్ పీఎస్ సీ గ్రూప్-1 ఉచిత కోచింగ్ నిర్వహించనున్నట్లు టీఎస్ బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత కోచింగ్ ను టీఎస్ బీసీ స్టడీ సర్కిల్, రోడ్ నెంబర్ 8, లక్ష్మీ నగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాదు నందు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన ఆసక్తి గల అభ్యర్థులు మార్చ్ 3 నుండి 7వ తేదీ వరకు నేరుగా పై చిరునామాలో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. మరిన్ని వివరాలకు 040-24071178 , 040-27077929 నంబర్లలో సంప్రదించాల్సిందిగా ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.