కవిత అక్రమ అరెస్టుని ఖండిస్తున్నాం:వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

0
16 Views

వికారాబాద్:నిన్న రాత్రి BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) అరెస్ట్ చేయడాన్ని వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఖండించారు.శనివారం వికారాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. BRS శ్రేణులతో కలిసి ధారూర్ మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్నప్పుడే ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన మండిపడ్డారు, రాజకీయ కుట్రలో భాగంగా కవితని అరెస్టు చేసారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి వీడాలని పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేసి, దిష్టిబొమ్మను దహనం చేసారు.