పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలి: జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

0
13 Views

వికారాబాద్: పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి కోరారు.శనివారం పార్లమెంటరీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరించి ఎన్నికలు సాఫీగా, సజావుగా జరిగేలా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించే క్రమంలో అనుమతులు పొందాలని తెలిపారు. సి.విజిల్ ద్వారా ప్రజలు ఫిర్యాదులు స్వీకరించి తదనుగుణంగా సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే అకౌంట్స్, ఎస్.ఎస్. టి, విఎస్టి, విధిని, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను సిద్ధం చేశామని ఆయన తెలిపారు.జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి మాట్లాడుతూ.. శాంతి భద్రతలను కాపాడే దిశగా శాఖా పరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా సరిహద్దులో 7 అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అవసరాన్ని బట్టి పెంచుకుంతమన్నారు. ఇప్పటికే 208 లైసెన్స్ ఆర్మ్స్ డిపాజిట్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలిపారు. ప్రెస్ మీట్ లో అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్ , ఆర్డీవోలు శ్రీనివాస్ రావు, ఎం.వాసు చంద్ర లు ఉన్నారు.