టెట్, డిఎస్సీ పైన ఉచిత అవగాహన సదస్సు

0
21 Views

వికారాబాద్: గత టెట్, డీఎస్సీ లలో జిల్లా మొదటి,మూడవ,నాల్గవ ర్యాంకులు సాధించిన వికారాబాద్ పట్టణంలోని ఏకేఆర్ స్టడీ సర్కిల్ లో ఈనెల 18 ,19,20 తేదీలలో ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ బి.వి రమణ తెలిపారు….. మే 20 నుండి టెట్ పరీక్షలు జూలై 17 నుండి డీఎస్సీ పరీక్షలు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే….. ఈ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాలలోని అగ్రశ్రేణి అధ్యాపక బృందం చే వికారాబాద్ ప్రాంతంలోని నిరుద్యోగ బి.ఎడ్ ,డిఎడ్ అభ్యర్థుల కోసం శిక్షణ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు… ఈ అవగాహన సదస్సుకు తెలుగు రాష్ట్రాలలోని అధ్యాపక బంధం పాల్గొంటారు…. డీఎడ్ సెకండ్ ఇయర్ అదేవిధంగా బి.ఎడ్ సెకండియర్ ప్రవేట్ సంస్థల్లో పని చేసే అభ్యర్థుల కోసం ఈవినింగ్ బ్యాచ్ తరగతులు కూడా ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు…. ఈ ప్రాంత నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు మరిన్ని వివరాలకు 9441022571 నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు…