ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలి:జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి

0
33 Views

వికారాబాద్:ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచి గ్రామ పరిది లో ఎన్ ఆర్ ఇ జి ఎస్ ద్వార జరిగే పనులపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం టెలికాన్ఫరెన్సు ద్వారా ఎక్కడైతే తక్కువ శాతం పనులు జరుగుచున్న గ్రామాలలో లేబర్ సమావేశాలు నిర్వహించి ,లేబర్ ను సమీకరించి 100 శాతం పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సి సి రోడ్ల కు సంబంధించి, లేబర్ మొబిలైజేషన్ కు సంబంధించి పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు. జిల్లా లో మొత్తం 565 గ్రామ పంచాయతి లలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలనీ ఆదేశించారు. గ్రామంలో ముళ్ళపొదలు క్లియర్ చేయడం , రోడ్లకు సంబంధించి భూమి చదును చేయడం గ్రామాలలో పెండింగ్ ఉన్న పనులన్నింటిని పూర్తి చేసి , పూర్తి అయిన వాటికీ ఎఫ్ టి ఓ జనరేట్ చేయాలనీ అధికారులకు ఆదేశించారు. గ్రామ పరిదిలో పంచాయతి సెక్రెటరి లను ఇన్వాల్వ్ చేసి గ్రామానికి ఉపయోగపడే పనులు చేయాలని అధికారులకు ఆదేశించారు.ఈ టెలికాన్ఫరెన్సు లో డి ఆర్ డి ఎ శ్రీనివాసులు,జిల్లా పంచాయతీ అధికారి జయసుధ , సంబంధిత అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.