నీటి ఎద్దడి లేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సమస్యలను పరిష్కరించాలి:వికారాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి విజయేంద్ర బోయ

0
13 Views

వికారాబాద్:నీటి ఎద్దడి లేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర రవాణా, రోడ్డు మరియు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి, వికారాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి విజయేంద్ర బోయ అధికారులను ఆదేశించారు.జిల్లాలోని రాఘవపూర్ (జాఫర్ పల్లి) లోని మిషన్ భగీరథ నీటి శుద్ది కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ , మిషన్ భగీరథ అధికారులతో కలిసి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా రాఘవాపూర్ లోని నీటి శుద్ధి కేంద్రం నుండి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలైన వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్ ప్రాంతాలలోని 755 గ్రామాలకు త్రాగు నీటిని అందించడం జరుగుతుందని అధికారులు జిల్లా ప్రత్యేక అధికారి విజయేంద్ర బోయకు తెలిపారు. మిషన్ భగీరథ నీరు అందించడంలో అనుకోకుండా ఇబ్బందులు కలిగినప్పుడు ప్రత్యామ్నాయంగా త్రాగునీటిని అందించేందుకు వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకొని త్రాగునీరు సరఫరా చేయాల్సిందిగా ఆమె అధికారులకు సూచించారు. ప్రజలకు ఏలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు బోరేవెల్స్, చేతిపంపులను మరమ్మతులు చేపట్టేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆమె తెలిపారు. ఎక్కడైనా పైపులైను లు పగిలిపోయినట్లయితే అధికారుల వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని ఆమె తెలిపారు.జిల్లా ప్రజల సౌకర్యార్థం త్రాగునీటిపై ఫిర్యాదుల నిమిత్తం కలెక్టరేట్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, 08416-242136 నంబర్ కు ఫోన్ చేసి తమ సమస్యను తెలియజేయాల్సిందిగా ఆమె తెలిపారు.ఈ పర్యటనలో మిషన్ భగీరథ ఎస్ఈ ఆంజనేయులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీయర్లు బాబు శ్రీనివాస్, చల్మారెడ్డి , మిషన్ భగీరథ డిఇ సుబ్రమణ్యం, మిషన్ భగీరథ సిబ్బంది పాల్గొన్నారు.