అవినీతి అధికారులకు అండ ఎవరు….? సస్పెన్షన్ అయినా అధికారుల ఎవరి ధీమా…?

0
29 Views

వికారాబాద్: అటవీ శాఖలో లక్షలలో అవినీతి జరిగింది. దాని పక్క ఆధారాలతో ఆంధ్రజ్యోతి పత్రిక తో పాటు పలు పత్రికలు ప్రచురించాయి. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు స్పందించారు విజిలెన్స్ అధికారులు జిల్లా వ్యాప్తంగా అవినీతిపై ఆరా తీశారు . ఆపై ఉన్నత అధికారులకు వారిని వేదికను సమర్పించారు. అన్ని విధాలుగా పరిశీలించిన ఉన్నత అధికారులు అధికారులు అవినీతి చేశారని నిర్ధారించి వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫారెస్ట్ శాఖ చరిత్రలోనే ఒకేసారి ఇద్దరూ రేంజర్లు సస్పెండ్ అయిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకోగా ఆ అధికారులు మాత్రం సస్పెండ్ ఆర్డర్నే ధిక్కరిస్తూ విధుల్లో నిమగ్నమవుతున్నారు. వికారాబాద్ ఎఫ్ ఆర్ వో తో పాటు తాండూర్ ఎఫ్ఆర్ఓ సైతం సస్పెన్షన్ ఆర్డర్ ను లెక్కచేయకుండా వారి పనుల్లో వారు ఉండగా సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిన మరుసటి రోజే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అధికారులు ప్రత్యక్షమయ్యారు. సస్పెన్షన్ ఆర్డర్ వచ్చి వారం రోజులు గడుస్తున్నా ఆ అధికారులు విధుల నుంచి తప్పుకోకుండా వ్యవహరిస్తున్న తీరు పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరో వారికి పూర్తిగా సహకరించడం వల్లే వారు ఇంత ధీమాగా ఉన్నారని సస్పెన్షన్ ఆర్డర్నే లెక్కచేయని పరిస్థితిలో వాళ్లు ఉన్నారంటే ఎవరు వారికి సహకరిస్తున్నారు ఏ ప్రజా ప్రతినిధి వారికి అండగా ఉన్నారని చర్చే జిల్లా వ్యాప్తంగా నడుస్తుంది. అవినీతి అధికారులను జిల్లా నాయకులే కాపాడితే ఎలా అనే ప్రశ్న రేకెత్తిస్తుంది. పాలకులు ప్రాంతా అభివృద్ధి కోసం ఆలోచించాలని అవినీతి అధికారులను కాపాడితే ఈ ప్రాంతం ఎలా ముందుకు వెళుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్టులు నిజాయితీగా వార్త కథనాలు రాస్తుంటే ఇలా అవినీతి అధికారులను పాలకులు కాపాడుకుంటూ పోతే ఎలా అనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.