కోళ్ల ఫామ్ లో గుట్కా దందా… స్థానికుల అండదండతోనే వ్యాపారం

0
109 Views

వికారాబాద్: దూరం నుండి చూస్తే అది కోలాఫామ్ కానీ దగ్గరికి వెళ్లి చూస్తే అదో రకమైన దందా…. దానికి స్థానిక రాజకీయ నాయకుల అండదండలు… చూసి చూడనట్లు వ్యవహరించే అధికారుల‌ ప్రోత్సాహం…. దీంతో ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా బాసిల్లుతున్న వేళ పోలీస్ పోలీసు ఉన్నత అధికారులకు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అక్రమంగా తయారు చేస్తున్న గుట్కా సామాగ్రిని పట్టుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

కోటిపల్లి మండలం ఓగ్లపూర్ పరిధిలోని ఓ ఫామ్ హౌస్ లో కొందరు అక్రమార్కులు గుట్కా తయారు చేస్తూ గత  కొన్ని నెలలుగా అక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఈ తతంగం కొందరు రాజకీయ నాయకుల ప్రోత్సాహం నడుస్తుందనే తెలుస్తుండగా అధికారులు సైతం ఆ వైపు కన్నెత్తి చూడకుండా వ్యవహరించారు అయితే పోలీసు ఉన్నతాధికారులకు పక్కా సమాచారం అందడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించగా కోట్పల్లి ఎస్సై స్రవంతి పోలీస్ సిబ్బంది కోళ్లఫామ్ పై దాడులు నిర్వహించారు. ఆ సమయంలో గుట్కా తయారీకి ఉపయోగించే ఐదు క్వింటాళ్ల సామాగ్రిని పోలీసులు పట్టుకున్నారు .  పోలీసులు అక్కడ దొరికిన వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్రవంతి తెలిపారు. అయితే పోలీసులు వస్తున్నారని ముందస్తు సమాచారంతో అక్కడి నిర్వాహకులు పరారీ కాగా వారికి ఎవరు సమాచారం అందించి ఉంటారని అనుమానాలు రేకెత్తుతున్నాయి. స్థానికుల హస్తం లేనిదే అక్కడ గుట్కా తయారీ జరగలేదని కొందరు రాజకీయ నాయకులే కావాలని ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.