ప్రారంభమైన అనంతగిరి చిన్న జాతర

0
94 Views

వికారాబాద్ ( అనంతగిరి ) : ఆషాడ మాస చిన్న జాతర పురస్కరించుకొని అనంతగిరి శ్రీ అనంతపద్మనాభ స్వామి జాతర ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయ అర్చకులు ధ్వజారోహణ కార్యక్రమంతో జాతర ఉత్సవాలను ప్రారంభించారు .ఐదు రోజులపాటు కొనసాగే ఈ జాతర ఉత్సవాల అనంతరం 21వ తారీఖున పెరుగు బసంతం నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదం కోసం పోటీపడతారు ఈ ప్రసాదాన్ని స్వీకరించి పంట పొలాల్లో వేసుకుంటే బంగారం పండుతుందని ప్రజలు విశ్వసిస్తారు.