రుణమాఫిలో రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
59 Views

వికారాబాద్: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం చేపట్టిన రైతు రుణ మాఫీ ద్వారా జమయ్యే రుణం రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగ కుండ నేరుగా రైతులకు చేరేలా బ్యాంకర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.
గురువారం కలెక్టర్ కార్యాలయంలో  బ్యాంకర్ల తో ఏర్పాటు చేసిన సమావేశం  పరిగి శాసన సభ్యులు రాం మోహన్ రెడ్డి , అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ లతో కలిసి నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతగా వేల కోట్ల రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తునట్లు అన్నారు. జిల్లా లో 46,633 మంది రైతులకు గాను 256.26 కోట్ల రూపాయలు రైతులకు రుణ మాఫీ లభించనుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు పెట్ట కుండ వారి ఖాతాలో జమ అయిన రుణమాఫీ  నేరుగా రైతులకే అందేటట్లు చూడాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతి రైతు వేదికలో రైతుల యొక్క లిస్టు డిస్ప్లే చేయాలన్నారు. రైతులకు సంబంధించిన 1 బి, ఆధార్ కార్డు , భూమికి సంబంధించిన పాస్ పుస్తకం తదితర డాకుమెంట్స్ తీసుకొని రెన్యువల్ కోసం బ్యాంకు కు రావాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతి లో కూడా రైతులకు సంబంధించి వివరాలతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేయాలనీ వ్యవసాయ అధికారికి ఆదేశించారు. 30 రోజుల పాటు వ్యవసాయ విస్తరణ అధికారులు అందుబాటులో ఉండి రైతు రుణమాఫీ రైతులకు చేరేలా చూడాలన్నారు. లిస్టు లో రైతుల పేర్లు లేని పక్షంలో జిల్లా కల్లెక్టేట్ కార్యాలయం నందు రుణమాఫీ సహాయ కేంద్రము టోల్ ఫ్రీ నెంబర్ లకు 9989291049 , 9000470989 సంప్రదించాలని తెలిపారు. ఈ సమావేశం లో ఎల్ డి .ఏం యాదగిరి,ఎస్ బి ఐ రిజినల్ మేనేజర్ పల్లం రాజు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , తెలంగాణా గ్రామీణ బ్యాంకు, కోపరేటివ్ బ్యాంకు, ఇతర బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.