వికారాబాద్ జిల్లా పై కాంగ్రెస్ ఆలోచన ఏంటి…? సర్వత్రా ఒకటే చర్చ

0
593 Views

వికారాబాద్: ఎన్నో సంవత్సరాల ఆకాంక్ష … ఎంతో మంది పోరాటం …  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ జిల్లాగా ఏర్పాటు చేసిన సందర్భం…. పరిపాలన దగ్గరకు వచ్చింది అభివృద్ది అంతగా లేక పోయినా ఏనాడైనా కాక పోతుందా అనే ఆశతో ఎదురు చూస్తున్న తరుణంలో అసెంబ్లీలో నిన్న జరిగిన చర్చ జిల్లా ప్రజలను కలవర పెడుతుంది. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి వికారాబాద్ జిల్లా శాస్త్రీయంగా జరులేదని తెలిపిన సందర్భం మనం చూశాం. అయితే అందులోవాస్తవమే ఉన్నప్పటికీ జిల్లా కేంద్రం వికారాబాద్ నుండి తరలించే కుట్ర ఏమైనా చేస్తున్నారా అనే సందేహాం కన్పిస్తుంది. అప్పట్లో వెనుకబడిన ప్రాంతాలైన కొడంగల్, వికారాబాద్, పరిగి, తాండూరు ప్రాంతాలతో జిల్లా ఏర్పాటు చేయగా ప్రస్తుతం తలసరి ఆదాయంలో  వికారాబాద్ జిల్లా రాష్ట్రంలోనే పూర్తిగా వెనుకబడి ఉంది. అప్పట్లో జిల్లా ఏర్పాటు సమయంలో చేవెళ్ల ప్రాంతానికి వికారాబాద్ లో కలిపి జిల్లా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కొందరూ రాజకీయ స్వార్థాల కోసం చేవెళ్ల ను రంగారెడ్డి జిల్లాలో కలిపి వికారాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ పరిధిలో ఒక జిల్లా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లుగా వినిపిస్తున్న సమయంలో వికారాబాద్ జిల్లా కేంద్రంగానే ఆ జిల్లా ఉండాలని ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. ఇందులో ఏ చిన్న పొరపాటుజరిగిన వికారాబాద్ ప్రాంతం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేందుకు అవకాశాలు లేకపోలేదని  చర్చ కూడా వినిపిస్తుంది.మరి వేచి చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం వికారాబాద్ ప్రాంతంలోనే పరిపాలన వ్యవస్థ ఉంచి వికారాబాద్ జిల్లా కేంద్రంగా కొనసాగిస్తుందా ఏదైనా మార్పుల జోలికి పోయి అపవాదం మూటగట్టుకుంటుందా అని ఎదురు చూడాల్సిందే.?