బోనమెత్తిన వికారాబాద్ .. వాడ వాడలో వేడుక

0
181 Views

వికారాబాద్ : ఆషాడ మాస బోనాల ఉత్సవం వికారాబాద్ పట్టణంలో వాడవాడలా కన్నుల పండుగగా జరిగింది. పట్టణంలోని ఇంద్ర నగర్ లో కౌన్సిలర్ బోండాల సువర్ణ ఆధ్వర్యంలో బోనాల వేడుకను నిర్వహించగా కొత్తగా ఎల్లమ్మ దేవాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పించగా పోతురాజుల విన్యాసాలు శివసత్తుల పూనకాలతో అమ్మవారికి భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు. అదేవిధంగా శివరాం నగర్ కాలనీలో కౌన్సిలర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించగా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు అదేవిధంగా సుభాష్ నగర్ కాలనీ, సింగారపు రాచన్న  కాలనీ లో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ ,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథం సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగులపల్లి రమేష్, మాజీ జీ కౌన్సిలర్ బోండాల శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.