కొత్త గడి ఉన్నత పాఠశాలలో 2003-04 బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం

0
225 Views

వికారాబాద్: వికారాబాద్ జిల్లా కొత్త గడి ఉన్నత పాఠశాలలో 2003-04 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు తమ యొక్క పాఠశాల జ్ఞాపకాలను నిమ్మర వేసుకుంటూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారికి ఆనాడు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులను మళ్లీ తమ పాఠశాలకు పిలిపించి ఘనంగా సత్కరించడం జరిగింది. మరియు వారి యొక్క అమూల్యమైన సందేశాలను పొందడం జరిగింది. ఆనాటి విద్యార్థులందరు తమ తమ రంగాలలో ఉంటూ సమాజ హితం కోసం కృషి చేయాలని అలాగే అందరూ కలిసికట్టుగా ఉంటూ ఎవరికి ఎలాంటి అవసరం ఏర్పడిన, సమస్య ఏర్పడిన సమిష్టిగా ఉండాలని నిర్ణహించుకోవటం చాలా చక్కటి పరిణామం. ఉపాధ్యాయులు మాట్లాడుతూ జీవన విధానంలో అత్యుత్తమమైన విలువలని పాటించాలని సంఘజీవిగా ఉండాలని పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఎనలేనిదని వారికి చక్కటి విద్యా బుద్దులు నేర్పాలని మరియు వారిని సరియైన మార్గంలో పయనించేలా పెంచాలని దేశ హితం కోసం కృషి చేయాలని తెలిపారు. కార్య క్రమంలో ఆనాటి ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ రెడ్డి , ఉపాద్యాయులు అనంత్ రెడ్డి , నర్శింహ రెడ్ది , సత్యనారాయణ రెడ్డి , నర్సింహులు, ఖాజా పాషా , స్వరూప టీచర్, కిష్టయ్య, బురాన్లు మరియు ఆనాటి విద్యార్థిని, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.