లా అండ్ ఆర్డర్ గతి తప్పింది అందుకే హైదరాబాద్ లో మూడు హత్యలు: అక్బరుద్దీన్ ఓవైసీ

0
115 Views

హైదరాబాద్: హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ సమస్య గురించి నిన్న నేను, హరీష్ రావు మాట్లాడితే లా అండ్ ఆర్డర్ బాగుంది అని మంత్రి అన్నారని .. మళ్లీ నిన్న నగరంలో 3 హత్యలు అయ్యాయని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు.. టాస్క్ ఫోర్స్ పోలీసుల పని నేరస్థులను పట్టుకోవడం కానీ వాళ్లు రాత్రి పూట సామాన్యుల మీద లాఠీఛార్జ్ చేస్తున్నారని  హైదరాబాద్‌లో పోలీసులు రాత్రిపూట డ్యూటీలు చేస్తూ పగటి పూట పడుకుంటున్నారని మండి పడ్డారు… హత్యలు పగటిపూట జరుగుతున్నాయని స్పష్టం చేశారు. హైదరాబాదులో అన్ని పోలీస్ స్టేషనులకు లంచాలు వెళ్తున్నాయి. ఒక ఏసీపీ నాకు ఫోన్ చేసి మీ ఏరియాలో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి డబ్బులు సాయం చేయమని అడిగితే, నేనెందుకు ఇవ్వాలి మీకు లంచాలు వస్తున్నాయి కదా దానితో కట్టండి అని చెప్పానని తెలిపారు.