స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
137 Views

వికారాబాద్:  స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో చేపట్టాల్సిన వివిధ అంశాలపై ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆగస్టు 5వ తేదీ నుండి 9 వ తేదీ వరకు స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చేపట్టే వివిధ అంశాలపై ముఖ్య కార్యదర్శి కలెక్టర్లకు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం పై అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లాలో ఐదు రోజులపాటు వివిధ అంశాలను రోజువారిగా చేపట్టాల్సిన పనులపై దృష్టి సారించాలన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాలతో సమావేశాలు నిర్వహించి అందరిని భాగస్వాములను చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, అంగన్వాడీలు, వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్ స్టాప్ లో పారిశుద్ధ పనులను చేపట్టిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే గా పాటిస్తూ మురుగు కాలువలు, నీరు నిలిచిన ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా అధికారులు కృషి చేయాలి అన్నారు. నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ తగిన సంఖ్యలో వేసినట్లయితే దోమల వృద్ధిని నిరోధించవచ్చని కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛదనం పచ్చదనం పై విద్యార్థులకు వ్యాసరచన, పద్య గేయాలు పోటీలు నిర్వహించి మొదటి, రెండవ బహుమతులను ఇచ్చి ప్రోత్సహించాలని కలెక్టర్ డిఇఓ కు సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టుకునేందుకు ప్రోత్సహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

వన మహోత్సవం కింద గ్రామపంచాయతీలు, పట్టణ ప్రాంతాలలో పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవెన్యూ ప్లాంటేషన్ నిమిత్తం అనువైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్ సూచించారు. ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటేందుకు ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున ఫలాలు ఇచ్చే మొక్కలు, మునగ , కరివేపాకు, మామిడి, ఉసిరి, దానిమ్మ తదితర ఇంటి అవసరాలకు ఉపయోగపడే మొక్కలను అందించాలని కలెక్టర్ తెలిపారు. కుక్కల బెడద ఉన్న ప్రాంతాలను గుర్తించి తీసుకోవాల్సిన జాగ్రత్తలకై చర్యలు చేపట్టలన్నారు

వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ సుదీర్, డిఆర్ డిఓ శ్రీనివాస్, డిపిఓ జయసుధ, డిఏంహెచ్ఓ పల్వన్ కుమార్, పంచాయతీరాజ్ ఇఇ ఉమేష్ , పశు సంవర్థక శాఖ అధికారి పూర్ణ చంద్ర రావు, ఆర్ అండ్ బి ఇంచార్జ్ ఇఇ శ్రీధర్ రెడ్డి, మెప్మా పిడి రవికుమార్, మిషన్ భగీరథ ఇఇ బాబు శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.