నిరుద్యోగాన్ని కిల్ చేసేందుకే స్కిల్ యూనివర్సిటీ ; చేవెళ్ల మాజీ ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి.

0
377 Views

రoగారెడ్డి:దేశమంతా నిరుద్యోగం పెరుగుతున్న తరుణంలో తెలంగాణలో రేవంత్ సర్కారు ఈ యూనివర్సిటీ ఇక్కడ పెట్టడం ఎంతగానో అవసరమని చేవెళ్ల మాజీ ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. నిరుద్యోగాన్ని ప్రారదోలేందుకు ఇది ఎంతగానో ఉపయోగ పడుతుందనీ ఆయన అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్‌లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీకి భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబుతో కలసి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ యూనివర్సిటీలో 17 కోర్సులు, ఏటా 20 వేల మందికి శిక్షణ ఇస్తారని అన్నారు. మూడు నాలుగేండ్ల కాల వ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సర్టిఫికెట్ కోర్సులు ఇందులో నిర్వహించి మన రాష్ట్రంలోని ప్రతి యువకుడిని స్కిల్ ఫుల్ గా తయారు చేయనుందన్నారు. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ఎంపిక చేయడం హర్షణీయమన్నారు.
మొత్తం 17 ప్రాధాన్య రంగాలను గుర్తించగా, ఫార్మా, కన్స్ట్రక్షన్, బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్ తదితరవి ఆ కోర్సుల్లో ఉన్నాయన్నారు. తొలుత ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులను ప్రవేశ పెడుతారనీ, ప్రతి కోర్సును సంబంధిత రంగంలో పేరొందిన ఒక కంపెనీ భాగస్వామ్యం ఉండేలా అనుసంధానం చేస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందేన్నారు. సాధారణ సర్టిఫికేట్ కోర్సులు చేయకుండా… మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని రంజిత్ రెడ్డి అభిప్రాయపడ్డారు