ఎస్సీ వర్గీకరణ పట్ల సియం రేవంత్ రెడ్డి నిర్ణయం తో మాదిగ సమాజం హర్షం వ్యక్తం చేస్తుంది: మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్

0
304 Views

హైదరాబాద్:  మూడు దశాబ్దాల కల సహకారం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే  ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి  అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ కచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం గొప్ప విషయమని మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారి ని కలిసి ధన్యవాదాలు తెలిపిన మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు ఈ సందర్భంగా పలు అంశాలపై వినతి పత్రం సియం కు అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.సీఎం నిర్ణయం పట్ల మాదిగ సమాజం హర్షం వ్యక్తం చేస్తుందని అన్నారు . వర్గీకరణ అంశంపై కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం ఫలింతమే ఈ విజయమని కొనియాడారు. తీర్పునకు అనుకూలంగా మాదిగ ఉప కులాలు వర్గీకరించి వారి నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్ అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇతర పార్టీలను ఎస్సీ వర్గీకరణకు రాజకీయాల కోసం వాడుకున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం చిత్తశుద్ధితో పనిచేసిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన కృషికి మాదిగ సమాజం కృతజ్ఞతలు తెలుపుతున్నదని అన్నారు.అదే విధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ మరియు ప్రస్తుత నియమాకాలను ఆపి ప్రస్తుత తెలంగాణలో జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవని సతీష్ మాదిగ, గజ్జలకాంతం, వెంకటేష్, ఉట్ల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.