గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల అస్వస్థత… ఆసుపత్రిలో వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్న కలెక్టర్

0
171 Views

వికారాబాద్: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు నిత్యం ఏదో ఒక ఇబ్బందితో అవస్థ పడుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థత గురవుతూ ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ మధ్యనే వికారాబాద్ అనంతగిరిపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థులు అస్వస్థకు గురై జాండీస్ రాగా తాజాగా అదే పాఠశాలలో మరో నలుగురు విద్యార్థులు జాండీస్ బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. అంతేకాకుండా బూరుగుపల్లి సమీపంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 15 నుంచి 20 మంది విద్యార్థినిలు జ్వరాల భారిన పడి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ ఆసుపత్రిని సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అయితే పాఠశాలల్లో పారిశుద్ధ్య సమస్య, పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, మరుగుదొడ్లు సరిగ్గా లేకపోవడం నీటి కలుషితం వల్లే అనారోగ్యాల పాలవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.