హైదరాబాద్ అబిడ్స్ లో అగ్నిప్రమాదం

0
89 Views

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ ప్రాంతంలో ఓ కామర్షియల్ కంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. తాజ్ మహల్ హోటల్ పక్కన ఉన్న బిల్డింగ్ లో రెనవేషన్ పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సాక్ష్యాలు చెప్తున్నట్లుగా, వెల్డింగ్ పనులు చేస్తున్నప్పుడు నిప్పు రవ్వల వల్ల మంటలు చెలరేగాయని పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, తుది నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది.