దేవుడిపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్

0
92 Views

అనంతగిరి డెస్క్: ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి తన నూతన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో చేసిన కొన్ని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు ప్రస్తావించారు. దేవుడిని నమ్మకపోయినా, నీతి నిజాయితీలతో జీవించడం మానవత్వం అని ఆయన అభిప్రాయపడ్డారు. దేవుడిని నమ్మనివారు కూడా మంచి విలువలు, నిజాయితీతో ఉంటారు” అని రాజమౌళి అన్నారు. ఇంకా, తన భార్య భగ్యలక్ష్మి యాక్సిడెంట్ అవడంతో చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు కూడా తాను దేవుడికి మొక్కలేదని ఆయన గుర్తుచేశారు. నా భార్యకు యాక్సిడెంట్ జరిగి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు కూడా నేను దేవుడికి మొక్కలేదు” అని ఆయన పేర్కొన్నారు. రాజమౌళి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశంగా మారాయి.