వికారాబాద్‌లో ఘనంగా నాగుల చవితి ఉత్సవాలు

0
171 Views

వికారాబాద్:వికారాబాద్‌ జిల్లాలో నాగుల చవితి పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక నాగ దేవత ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా కాలనీలలోని నాగుల పుట్టల వద్ద భక్తులు భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించారు. పుట్టల్లో పాలు పోసి, నైవేద్యాలు సమర్పించి, నాగదేవతను ఆరాధించారు.భక్తుల రాకతో నాగుల పుట్టల వద్ద సందడి నెలకొంది. ఈ పర్వదినం సందర్భంగా స్థానిక కౌన్సిలర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు, భక్తులకు అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంచారు.